Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ
నవతెలంగాణ- భువనగిరిటౌన్
పెరుగుతున్న నిత్యావసర ధరలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ విమర్శించారు. ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో కూరగాలయ దండలు పట్టుకొని మంగళవారం పట్టణకేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎడేండ్ల మోడీ పాలనలో ధరలు ఆకాశాన్నం టాయన్నారు. గ్యాస్,పెట్రోల్, డిజిల్ ,నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్య ప్రజలభారాలు మోపుతోందన్నారు. వెంటనే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయకార్యదర్శి దాసరి మంజూల, జిల్లా కోశాదికారి కల్లూరి నాగమణి,జిల్లా కమాటి సభ్యులు దండు స్వరూప, పట్టణ నాయకురాలు మాటూరి కవిత, హేమలత పాల్గొన్నారు.