Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చిలుకూరు
కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం సాగుతోందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. మంగళవారం మండలంలోని దూదియాతండ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు చేస్తున్న యాత్ర అబద్ధాల యాత్ర అని విమర్శించారు. మసీదు, మందిరం పేరుతో రాజకీయం చేస్తున్నారే తప్ప రైతు సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన యాత్ర లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే యాసంగి పంట వరి ధాన్యాన్ని కొంటుందో ..లేదో తేల్చి చెప్పాలన్నారు. అనంతరం పలువురు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షులు కొండా సైదయ్య, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షులు దొడ్డ సురేష్, చిలుకూరు పీఏసీఎస్ చైర్మెన్ అలసకాని జనార్ధన్, మాజీ జెడ్పీటీసీ బట్టి శివాజీ నాయక్, ఎంపీటీసీ కృష్ణచైతన్య, బట్టు వెంకటేశ్వర్లు, బాలాజీ, కిమా శ్రీను పాల్గొన్నారు.