Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హుజూర్నగర్
పట్టణంలోని ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఈ నెల 21 నుంచి డిసెంబర్ 19వ తేదీవరకూ జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించనున్నట్టు ఆ పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ లక్ష్మీరావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఆటల పోటీల్లో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థల్లో చదువుతున్న 5 నుంచి 10వ తరగతుల విద్యార్థులు పాల్గొనొచ్చన్నారు. క్రీడల్లో పాల్గొనేందుకు ఎలాంటి ఫీజూ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి రూ.2 లక్షల వరకూ బహుమతులు అందజేస్తామన్నారు. 21న బాలబాలికలకు బాస్కెట్‌బాల్, వాలీబాల్ పోటీలు, 27న త్రోబాల్, 28న ఖోఖో, డిసెంబర్ 4, కబడ్డీ, 5న క్యారమ్స్, 11న రన్నింగ్, 12న ట్రాక్ ఈవెంట్స్ మీటర్ రేస్, 18న బాల్ విసరడం, 19న వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు కరోనా నిబంధనలు పాటిస్తూ పోటీల్లో పాల్గొన వచ్చని తెలిపారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ పి.తేజస్విని, మేనేజర్ మధుసూదన్‌రావు, పీఈటీ జె.నరసింహారావు పాల్గొన్నారు.