Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
జాతీయ రహదారి పక్కన జీడికల్ రోడ్డు వద్ద ఆలేరు పట్టణ టీఆర్ఎస్
సోషల్ మీడియా అధ్యక్షుడు ఎండి.జమాల్ ఉపాధి కోసం ఇటీవల డబ్బా వేసుకున్నానని తనను అకారణంగా బీజేపీపట్టణ అధ్యక్షుడు బందెల సుభాష్ వేధిస్తున్నాడని యూత్ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఎస్ఐ ఇద్రీష్ అలీకి ఫిర్యాదు చేశారు.
బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జీడికల్ రోడ్డు బైపాస్ పక్కన రోడ్డు ముందు ఆక్రమించుకుని డబ్బా ఏర్పాటు చేయడంతో, అడ్డు ఉండడం కారణంగా అటు నుంచి ఇటు వచ్చే వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ముందని, డబ్బాను తొలగించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంఘు భూపతి, నాయకులు బడుగు జహంగీర్ , పంపరి లక్ష్మీనారాయణ,వడ్డెమాను కిషన్ ,కళ్లెం రాజు, కూరెళ్ళ అంజన్, బెజ్జం సోమరాజు, తదితరులు పాల్గొన్నారు.