Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అందె సత్యం
నవతెలంగాణ-మోత్కూరు
ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంచడమే లక్ష్యమని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అందె సత్యం అన్నారు. మోత్కూరు యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర జన విజ్ఞాన వేదిక మహాసభల సన్నాహక సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎస్.భాస్కరాచారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను శాస్త్రీయ దక్పథం వైపు మళ్లించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. సామాజిక సంబంధాలు మెరుగుపర్చు కోవాలన్నారు.శాస్త్రీయ పరిశోధనలు ప్రజల శ్రమ తగ్గించి ఉత్పత్తి పెంచేలా ఉండాలని చెప్పారు. కరోనా సమయంలో రాష్ట్రంలో 15 లక్షల మాస్కులు, రూ.కోటి విలువైన ఆహార పదార్థాలు కరోనా బాధితులకు పంపిణీ చేసినట్టు చెప్పారు. యాదగిరిగుట్టలోఈనెల 27, 28 తేదీల్లో జరిగే జన విజ్ఞాన వేదిక నాల్గవ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధానకార్యదర్శి వరప్రసాద్, రాష్ట్ర నాయకులు వెంకటరమణారెడ్డి, చెకుముఖి రాష్ట్ర ఇన్చార్జి రాజా, ఉమ్మడి జిల్లా మాజీ కార్యదర్శి వనం శాంతికమార్, నాయకులు శ్రీనివాస్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.aాన్సీ, లక్ష్భి, నర్సమ్మ ,తదితరులు పాల్గొన్నారు.