Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరిరూరల్
రాష్ట్రంలో కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 5 లక్షల కుటుంబాల ఉపాధి కోసం కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.5 వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆ సంఘం మండల సదస్సులో ఆయన మాట్లాడారు. తరతరాల నుంచి వృత్తిని నమ్ముకుంటూ ప్రభుత్వానికి పన్నులు కడుతూ జీవిస్తున్న కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందన్నారు. మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. ప్రతి సొసైటీకి ఐదెకరాల భూమి, కల్లుకు మార్కెట్, నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరారు. సంఘం సీనియర్ నాయకులు కోలా యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అబ్బగాని బిక్షం, తాటిపాముల మాజీ సర్పంచి కారుపోతుల అంజయ్య, వెలిశాల సొసైటీ అధ్యక్షులు దూపాటి రాములు, జలాల్పురం సొసైటీ అధ్యక్షులు వేముల బిక్షం, కారు పోతుల రాజ కుమార్ తదితరులు పాల్గొన్నారు.