Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ధాన్యం కొనుగోలు చేసేంత వరకూ పోరాటం ఆగదు
అ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు
నవతెలంగాణ - సూర్యాపేట
'మాపై దాడికి స్కెచ్ వేసినప్పుడే కేసీఆర్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. కేసీఆర్ అవినీతి చిట్టా విప్పి ఆయన్ను తప్పకుండా జైలుకు పంపిస్తాం' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేసేంత వరకు రైతుల పక్షాన చేసే పోరాటం ఆగదన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. తమపై జరిగే దాడుల గురించి పోలీసులకు తెలియదా అని ప్రశ్నించారు. కోడిగుడ్లు, రాళ్లు పడతాయని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే ఎలా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల తంతులో అన్నింటీకీ కేంద్రం డబ్బులు చెల్లిస్తుందన్నారు. రుణమాఫీ, ఫసల్‌బీమా యోజనను కేసీఆర్ ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాళ్లు మొక్కిన కలెక్టర్‌ను ఎమ్మెల్సీ చేస్తున్న ముఖ్యమంత్రికి రైతుల గోడు పట్టదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సంకీనేని వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యారెడ్డి, పాదూరి కరుణ తదితరులు పాల్గొన్నారు.