Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బొమ్మలరామరం
మండలంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో బోరు భావిని మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. అంతరం ఆస్పత్రిలోని పరిసరాలను పరిశీలించి బాగున్నాయని ప్రశంసించారు. వాలు గోడలకు సూచనల పట్టికలను, వ్యాక్సినేషన్ చేసిన చిత్రాలను అతికించాలని సూచించారు. అనంతరం నాగినేనిపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, పల్లె ప్రకతి వనం, వైకుంఠ దమాలను పరిశీలిం చారు.ఆ గ్రామ సర్పంచ్ బీరప్పను అభినందించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలన్నారు. గన్ని బ్యాగులు, ట్రాన్స్పోర్ట్ట్ వాహనాల కొరత ఉందని తెలపడంతో అన్ని సదుపాయాలు కల్పిస్తామని,దీపావళి కారణంగా కొంత ఆలస్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జ్యోతి కుమార్, తహసీల్దార్ పద్మ సుందరి, ఎంపీడీఓ సరిత,వైద్యాధికారులు శ్రవణ్ కుమార్, డా.క్రాంతి ఎంపీవో వెంకటేశ్వర్లు, ఆర్ఐ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.