Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడరూరల్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈశ్రమ స్కీంను కార్మికులు ఉపయోగించుకోవాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ముత్యాలు పిలుపునిచ్చారు. గురువారం పట్టణ పరిధిలోని కొమరబండ రైస్ మిల్లు వద్ద, అంబిక మార్బుల్స్ వర్కర్స్ యూనియన్ వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని మీ సేవా కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ స్కీంలో జాయిన్ కావొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు కృష్ణ, రవీందర్, శ్రీను, వీరేందర్, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.