Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
కేజీబీవీ పాఠశాలకు సొంత భవనం నిర్మించాలని యూఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో గురువారం ఆర్డీవో గోపినాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు నేనావత్ కుమార్నాయక్, వంగూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేరేడుగొమ్ము మండలం కేజీబీవీ పాఠశాలను దేవరకొండ పట్టణంలోని అద్దె భవనంలోకి మార్చినట్టు తెలిపారు. అందులో విద్యార్థినులకు సరిపడా తరగతి గదులు, వసతి గదులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వసతులపై ప్రశ్నించిన విద్యార్థినులను టీసీ ఇచ్చి పంపిస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు, యూఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి సయ్యద్ ఫయాజ్, మండలాధ్యక్షులు మొహ్మద్ షోహేబ్, మొహ్మద్ ముజాకీర్, మొహ్మద్ తౌఫిక్, మొహ్మద్ సౌభాన్ తదితరులు పాల్గొన్నారు.