Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడరూరల్
ఈనెల 21న మండల పరిధిలోని ద్వారకుంట గ్రామ శివారులో కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కమ్మ వనభోజన మహోత్సవ కరపత్రాన్ని గురువారం పీఏసీఎస్ చైర్మెన్ నలజాల శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామనాగేశ్వర్‌రావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మిర్యాలగూడ ఎమ్మెల్యే నలబోతు భాస్కర్‌రావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హాజరు కానున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి భాస్కర్‌రావు, ఉపాధ్యక్షులు వేమూరి సత్యనారాయణ, దొండేటి శ్రీనివాస్‌రావు, హనుమంతరావు, యూత్ అధ్యక్షులు పోటు కోటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.