Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చివ్వేంల
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ చేపట్టిన మహా ధర్నాకు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జూలకంటి జీవన్‌రెడ్డి, ఎంపీపీ ధరావత్ కుమారిబాబు నాయక్, జెడ్పీటీసీ భూక్య సంజీవ్ నాయక్, పీఏసీఎస్ అధ్యక్షుడు మారినేని సుధీర్‌రావు భారీగా తరలి వెళ్లారు.
గుర్రంపోడు : ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహిస్తున్న రైతు మహాధర్నాకు గురువారం స్థానిక టీఆర్ఎస్ నాయకులు భారీగా తరలి వెళ్లారు. వాహనాలను ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షులు గజ్జల చెన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖరరావు, వైస్ ఎంపీపీ సజ్జ రామేశ్వరిధనుంజయ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు తోటి చంద్రమౌళి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రావులపాటి భాస్కర్, పీఏసీఎస్ చైర్మెన్ ఆవుల వెంకన్నయాదవ్, సర్పంచులు ఎరుకల రేణుశ్రీ, రామలింగం, చాడ చక్రవర్తి, టీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షులు కుప్ప పృథ్వీరాజ్‌గౌడ్, మేడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.