Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాలకవీడు
ఈ నెల 21న మోతెలో నిర్వహించనున్న టీఎస్‌యూటీఎఫ్ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ముద్రించిన ఆహ్వాన పత్రికను గురువారం ఆ సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండలాధ్యక్షుడు రెడ్డిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సమావేశానికి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు జంగయ్యతో పాటు పలువురు హాజరు కానున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల ప్రధాన కార్యదర్శి అందే సైదయ్య, వరప్రసాద్, కుక్కడుపు సైదులు, ఉపేందర్, వెంకటేశ్వర్లు, నవీన్‌కుమార్, రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.