Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వేములపల్లి
అనారోగ్యం బారిన పడి వైద్యం పొందిన నిరుపేదలకు గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జావిద్ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంలాంటిందన్నారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు సహకారంతో చెక్కులు అందజేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అవిరెడ్డి శేఖర్‌రెడ్డి, మాలి శంకర్‌రెడ్డి, లతీఫ్, యాసీన్, రాజు, అక్రమ్, సాజిద్, అజ్గర్ తదితరులు పాల్గొన్నారు.