Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మోతే
తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండిం చిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొను గోలు చేయాలని తెలంగాణ గ్రామీణ పేదల సంఘం అధ్యక్ష కార్యదర్శులు పడిగ ఎర్రయ్య, గన్నెబోయిన వెంకటాద్రి డిమాండ్ చేశారు. గురువారం మండల పరిధిలోని నామవరం గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో పోసిన ధాన్యా న్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి ప్రతి గింజనూ కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిపై ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరినొకరు దూషించుకుంటూ, దాడులు చేసుకుంటూ రైతులను గందరగోళంలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వారి వెంట జిల్లా నాయకులు సుంకర రమేష్ బాబు, దైద లింగయ్య, పాలకూరి ఎల్లయ్య, తండు మల్సూరు పాల్గొన్నారు.