Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చలర్ రీసెర్చ్ ఫలితాల్లో ఆల్ ఇండియా 377, ఎస్సీ కేటగిరిలో 27వ ర్యాంకు సాధించిన రణపంగ గౌతమిని టీఆర్ఎస్ జిల్లా నాయకురాలు గార్లపాటి స్వర్ణ, ఆమె కుమారుడు గార్లపాటి శివారెడ్డిలు గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ గౌతమి తన బాబారు రణపంగ నర్సయ్య ప్రోత్సాహంతోనే మంచి ర్యాంకు సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత మామిడి సోమయ్య, కొన్నే వెంకన్న, శేఖర్, సలిగంటి రాకేష్, రణపంగ విజ్ఞాన్, నాని, సుంకరి హరి, గుండు మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.