Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అర్వపల్లి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని రకాల సదుపాయాలూ కల్పించాలని ఎంపీపీ మన్నె రేణుక, వ్యవసాయాధికారి రామారావునాయక్ కోరారు. గురువారం మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రం వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించి మాట్లాడారు. రైతులందరూ ధాన్యాన్ని ఆరబెట్టి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలన్నారు రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూర్పారబట్టే మిషన్లను అందుబాటులో ఉంచి వాటి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని నిర్వాహకులకు ఆదేశించారు. పట్టాలు, గన్నీబ్యాగులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి దినకర్, టీఆర్ఎస్ నాయకులు మన్నె లక్ష్మీనర్సయ్యయాదవ్, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు పి.ఎర్ర నర్సయ్య, ఏఈవో శోభారాణి, సత్యం తదితరులు పాల్గొన్నారు.