Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూర్యాపేటరూరల్
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో తలపెట్టిన మహా ధర్నాకు సూర్యాపేట పట్టణం నుంచి టీఆర్ఎస్ శ్రేణులు గురువారం భారీగా తరలి వెళ్లారు. ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ జీడి బిక్షంల ఆధ్వర్యంలో పలు వాహనాల్లో భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేంత వరకూ పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్‌నాయుడు, నాయకులు రమణారెడ్డి, గన్నారెడ్డి, ఉపేందర్, వినోద్, కిరణ్, సైదులు, పుల్లారెడ్డి, భీంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకన్న, నరేష్, దశరథ, తిరుమల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.