Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మండల కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాక లింగయ్య తెలిపారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆ సంఘం సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యక్షులుగా జి.రాములు, ప్రధాన కార్యదర్శిగా దేవేందర్, ఉపాధ్యక్షులుగా పి.బి.నాగేందర్లను ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్ కవిత, ఉపాధ్యాయులు పి.నర్సింహాచారి, కె.శ్రీలత, సైదులు, డి.నాగు, డి.సైదులు, బి.కవితా గ్రేస్ తదితరులు పాల్గొన్నారు.