Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కోదాడరూరల్
మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉచిత పశువైద్య, గర్బ కోశ వ్యాధుల చికిత్సా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ కసాని వెంకటేశ్వర్లు పాడి రైతులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖాధికారి డి.శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ రైతులు పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిబిరంలో 60 పశువులకు చికిత్స చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వెంకన్న, కోదాడ అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, వీరారెడ్డి, నాగేంద్రబాబు, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.