Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా కార్యదర్శిగా రెండో సారి ఎన్నికైన ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
అ 11 మందితో జిల్లా కార్యదర్శివర్గం
అ 32 మందితో జిల్లా కమిటీ ఎన్నిక
అ పలు తీర్మానాల ఆమోదం
నవతెలంగాణ - నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
రెండు రోజులుగా జరుగుతున్న సీపీఐ(ఎం) 20వ జిల్లా మహాసభలు గురువారం ముగిసాయి. మొదటి రోజు ప్రారంభ సభ, ప్రతినిధుల సమావేశం జరిగింది. రెండోరోజు జిల్లాలోని 31 మండలాలు, ప్రజా సంఘాల బాధ్యులు తమ నివేదికలను ప్రవేశ పెట్టారు. చివరి రోజు సాయంత్రం నూతన జిల్లా కమిటీని ప్రకటించారు. ఆ తర్వాత కమిటీ సమావేశం నిర్వహించి జిల్లా కార్యదర్శివర్గ సభ్యుల ఎంపిక, నూతన జిల్లా కార్యదర్శిని ఎన్నుకున్నారు. గతంలో జిల్లా కమిటీ 34 మందితో ఉండేది. అయితే ఈసారి 43 మందిని ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఎన్నికైనట్లు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రకటించగా జిల్లా కమిటీ సభ్యులను సుధాకర్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం పార్టీ చేపట్టాల్సిన ఆందోళనలు, రైతులను మోసం చేసే కుట్రలో భాగంగా అధికార పార్టీలు ఆడుతున్న డ్రామాలను వివరించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజల పక్షాన మాట్లాడేవారిని ప్రజలెప్పుడూ ఆదరిస్తారన్నారు.
జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరే
సీపీఐ(ఎం) జిల్లా నూతన కమిటీని 43 మందితో ఎన్నుకున్నారు. అందులో 11 మందిని జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులుగా తుమ్మల వీరారెడ్డి, నారి అయిలయ్య, డబ్బికార్ మల్లేశ్, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, కందాల ప్రమీల, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, చిన్నపాక లక్ష్మినారాయణ, ఎం.ప్రభావతి, సయ్యద్ హాశంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా కమిటీ సభ్యులు వీరే..
జిల్లా కమిటీని 32 మందితో ఎన్నుకున్నారు. పుచ్చ కాయల నర్సిరెడ్డి, గంజి మురళీధర్, ఎమ్‌డి.సలీం, దండెం పల్లి సత్తయ్య, జిట్టా నగేష్, అవిశెట్టి శంకరయ్య, పెంజర్ల సైదులు, బొజ్జ చిన్నవెంకులు, మరోజు చంద్రమౌళి, వీరపల్లి వెంకటేశ్వర్లు, ఎం.రవినాయక్, చేగోని సీతారాములు, కంబాలపల్లి ఆనంద్, రాజశేఖర్, కొండేటి శ్రీను, అవుత సైదయ్య, వరలక్ష్మి, జిట్టా సరోజ, కొండ అనురాధ, తుమ్మల పద్మ, వినోద్ నాయక్, రొండి శ్రీనివాస్, పరుశురాములు, మల్లం మహేష్, నాంపల్లి చంద్రమౌళి, పాదూరి శశిధర్‌రెడ్డి, అయూబ్‌ఖాన్, ఆర్.మంగారెడ్డి, నన్నూరి వెంకట రమణారెడ్డి, నల్లా వెంకటయ్య, రాచకొండ వెంకన్న, రాంమూర్తిలను ఎన్నుకున్నారు.
ఆకట్టుకున్న పాటలు
జిల్లా మహాసభల సందర్బంగా ప్రజానాట్యమండలి కళాకారులు పాడిన పాటలు అందరిని ఆకర్షించాయి. గతంలో చేసిన ప్రజా ఉద్యమ పోరాట పాటలు, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలపై ఆలపించిన పాటలు సభకు వచ్చిన ప్రతినిధులను ఆకట్టుకోవడంతో పాటుగా ఆలోచింపజేశాయి. మహిళా ప్రతినిధులు వేసిన నృత్యాలు కూడా అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ మహాసభల్లో పీఎన్ఎం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్, కట్టా నర్సింహా, జిల్లా కార్యదర్శి కుమ్మరి శంకర్, ఎస్ఆర్.వెంకటేశ్వర్లు, డీవైఎఫ్ఐ నాయకులు శంకర్, నరేశ్, చంటి, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
15 తీర్మానాల ఆమోదం
జిల్లా మహాసభల్లో 15 తీర్మానాలను ఆమోదించారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని, కృష్ణ పట్టెను కారిడార్‌గా ఏర్పాటు చేసి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని తీర్మానించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, ధరణిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిం చి పారదర్శకంగా అమలు చేయాలని తీర్మానించారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించాలని, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలను నిలిపేయాలని, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, ఉపాధ్యాయ రంగ సమస్యలు పరిష్కరించాలని, గిరిజనులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఐటీడీఏ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. విద్యారంగానికి నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు, మూడెకరాల భూమి, మెడికల్ కాలేజీకి సొంత బిల్డింగ్ నిర్మించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.