Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ-దేవరకొండ
ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.శుక్రవారం దేవరకొండ ఆర్టీసీ డిపోలో గ్యార్మీ పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు.ఆర్టీసీ కార్మికులకు విశ్రాంతి భవనం నిర్మాణానికి సొంతం నిధుల నుండి రూ.10లక్షలతో మంజూరు చేస్తానని హామీనిచ్చారు.ఆర్టీసీ డిపోలో మౌలిక సదుపాయాల కల్పనకు కషి చేస్తానని తెలిపారు.ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఆల్లంపల్లి నర్సింహ, రైతుబంధు అధ్యక్షులు శిరందాసు కష్ణయ్య, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, నియోజకవర్గఅధ్యక్షుడు బొడ్డుపల్లి కష్ణ, డిపో మేనేజర్ రాజీవ్ ప్రేమ్‌కుమార్, ఆర్టీసీ కార్మికులు రాజేందర్, ఉస్మాన్, కోటియానాయక్, సమత్, రబ్బానీ, బాలగంగాచారి, ఎంజె. ఖాన్ పాల్గొన్నారు.