Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
కష్టపడి చదివిన ప్రతి విద్యార్థికి కస్తూరి ఫౌండేషన్ అండగా ఉంటుందని కస్తూరి ఫౌండేషన్ చైర్మెన్ శ్రీచరణ్ అన్నారు.శుక్రవారం మండలంలోని కొండాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొండాపురం ప్రభుత్వ పాఠశాలకు రూ.4లక్షలవ్యయంతో నూతన ఆధునీకరణ చేశామ న్నారు.ఈ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగులు, పెన్నులు, విద్యార్థి అవస రమైన ప్రతి ఒక్కటి విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతమే తమ లక్ష్య మన్నారు. అనంతరం పలువురు చరణ్‌ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ సెక్రెటరీ కొత్తపల్లి నర్సింహాగౌడ్, ప్రధానోపాధ్యాయులు వెంకట్‌రెడ్డి, సర్పంచ్ బరిగెల యాదమ్మ, విద్యా కమిటీ చైర్మెన్ చిలువేరు అంజయ్య, నరేందర్‌రెడ్డి, భీమరాజు నర్సింహ పాల్గొన్నారు.