Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేసిన అనుచితవ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని, ఆర్ఎస్పీకి తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రియదర్శిని మేడి డిమాండ్ చేశారు.శుక్రవారం మండలకేంద్రంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు.నేడు తెలుగు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు మెరుగ్గా ఉండడానికి తమ వంతు కషి చేసిన పోలీస్ అధికారుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకరని అన్నారు.ఆయన జీవితమంతా తెరిచినపుస్తకం అన్నారు.ఉద్యోగ జీవితం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సాగిందన్నారు.పోలీస్ డిపార్టుమెంట్లో చేసిన సేవలకు గాను పొందిన మెడల్స్, అవార్డులు ఈ దేశ ప్రజలకు గర్వకారణమన్నారు.అడవిబాట పట్టిన అన్నలను కరీంనగర్ ఎస్పీగా జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఆర్ఎస్పీ రూపొందించిన కార్యక్రమాలు చరిత్రలో లిఖించబడి బడతా యన్నారు.భారత రాజ్యాంగాన్ని తూచతప్పకుండా పాటించిన అరుదైన వ్యక్తుల్లో ఆర్ఎస్పీ ఒకరని వివరించారు.ప్రమోషన్ల కోసం పదవుల కోసం ఎన్కౌంటర్లు చేశారని కోనప్ప మాట్లాడడం యావత్ బహుజన సమాజాన్ని అవమానించడంగా భావిస్తున్నామన్నారు.ప్రజలను మోసగిస్తున్న అధికార పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు.హామీల అమలు చేతగాని ప్రభుత్వం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు దమ్ముంటే రాజీనామా చేసి ప్రజాకోర్టులోకి వచ్చి తమ నిబద్ధత నిరూపించుకోవాలన్నారు. అలా కాని పక్షంలో ఆర్ఎస్పీ, తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్కు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో నియో జకవర్గ ప్రధాన కార్యదర్శి చిరుమర్తి సైదులు,మండల మహిళ కన్వీనర్ కొత్తకొండ లక్ష్మీ, మల్లేష్, ఐలయ్య, శ్రీను ,నగేష్ శాంతికుమార్ పాల్గొన్నారు.