Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నాంపల్లి
17,18వ తేదీల్లో నల్లగొండలో జరిగిన సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా 20వ మహాసభలలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళిని పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.చంద్రమౌళి మండలకేంద్రానికి చెందిన రజక కుటుంబంలో జన్మించి చిన్నతనం నుంచే చదువుకునే వయసులోనే ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో 1996,1997, సంవత్సరాలలో ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో పాల్గొని మండల కమిటీ సభ్యుడిగా, డివిజన్ కమిటీ సభ్యులుగా కొనసాగుతూ పాటలకు ఆకర్షితుడై ప్రజానాట్యమండలి గాయకుడిగా ఎదిగారు.ప్రజానాట్యమండలి మండల కార్యదర్శిగా, డివిజన్ కార్యదర్శిగా, ప్రస్తుతం ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేస్తామన్నారు.