Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
రైతులు చేసిన పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, న్యూడెమోక్రసీ (చంద్రన్నవర్గం) నాయకులు ఆరుట్ల శంకర్‌రెడ్డి, సీపీఐ జిల్లా నాయకులు మూరగుండ్ల లక్ష్మయ్య, బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి చామకూరి నర్సయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాల రద్దు కోసం సంవత్సర కాలంగా రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారన్నారు. పాలకులు ఎంతటివారైనా ప్రజా ఉద్యమాలకు తలవంచక తప్పదన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కండ్లు తెరిచి వ్యవసాయ రంగంలోని సంక్షోభాన్ని, నష్టాలను నివారించడానికి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్నారు. రైతులు సాగించిన ఉద్యమంలో 700 మందికి పైగా రైతులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు గట్ల రమ శంకర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు మట్టిపెళ్లి సైదులు, కోట గోపి, దండ వెంకట్‌రెడ్డి, ఎల్గూరి గోవింద్, వేల్పుల వెంకన్న, నాయకులు కొప్పుల రజిత, సాయికుమార్, గంట నాగయ్య, బొడ్డు శంకర్, కోట మధుసూదన్‌రెడ్డి, కునుకుంట్ల సైదులు, కారింగుల వెంకన్న, పోలెబోయిన కిరణ్, షేక్ సయ్యద్, పీవోడబ్ల్యూ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రేణుక, దొంతమల్ల రామన్న, గోరంట్ల వీరన్న, ఏసోబు, తాళ్లపల్లి శ్రీను, కొండ వెంకన్న, మామిడి సుందరయ్య, గుద్దేటి వెంకన్న, బచ్చలకూర రాంచరణ్, పల్లెటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.