Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వామపక్షాల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించడం రైతుల విజయమేనని సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్లచట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు ఏడాదికాలంగా చేస్తున్న పోరాటం ఫలితంగా కేంద్రం ప్రభుత్వం నల్లచట్టాలను రద్దు చేస్తామని ప్రకటించడం పట్ల శుక్రవారం జిల్లాకేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.సుభాష్ విగ్రహం వద్ద బాణాసంచాలు కాల్చి సంబురాలు జరుపు కున్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, తుమ్మలవీరారెడ్డి, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, చినపాక లక్ష్మీ నారాయణ, కొండ వెంకన్న, పాలడుగు ప్రభావతి, కొండ అనురాధ, తుమ్మల పద్మ, కనుకుంట్ల ఉమారాణి,భూతం అరుణకుమారి, దండెంపల్లి సత్తయ్య, ఎండి సలీం, సయ్యద్ హాషం, మల్లం మహేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.