Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
మండలపరిధిలోని నక్కలపల్లి ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్న కవి, రచయిత, పుడమి సాహితీ వేదిక వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు చిలుముల బాల్‌రెడ్డిని గ్లోబల్ టీచర్ అంతర్జాతీయ పురస్కారం 2021 వరించిం. శుక్రవారం స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఫౌండర్, చైర్మెన్‌్ డా.ఆకుల రమేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కవి, రచయితగా బాల్‌రెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక గుర్తింపు పొందారు.అదేవిధంగా నల్లగొండ జిల్లాకేంద్రంగా పుడమిసాహితీవేదికను స్థాపించి, వ్యవస్థాపక అధ్యక్షులుగా తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.సంస్థ తరపున కొన్నేండ్లుగా వందలాది మందిని గుర్తించి రాష్ట్ర, జాతీయ పురస్కారాలు అందించారు.ఈ సేవలన్నింటిని పరిగణనలోకి తీసుకుని గ్లోబల్ టీచర్ అంతర్జాతీయ పురస్కారం-2021కు ఎంపిక చేసినట్టు తెలిపారు.ఈ పురస్కారం ఈనెల 21న, ఆదివారం హైదరాబాద్‌లో ఉమ్మడిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి నాందేడ్ల భాస్కర్‌రావు చేతుల మీదుగా బాల్రెడ్డికి అందజేయనున్నారు.