Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు.శుక్రవారం స్థానిక బాకల్వాడి పాఠశాలలో ఆ సంఘం సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వహించిందన్నారు. మూడు విడతల కరువుభత్యం పెండింగ్లో ఉందని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని, సబ్జెక్ట్ టీచర్ల కొరతను నివారించాలని కోరారు.ఉపాధ్యాయుల నియామకాలను వెంటనే చేపట్టాలని,బదిలీలు నిర్వహించి పదోన్నతులు కల్పించాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మోహన్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమయ్య,రాష్ట్ర కౌన్సిలర్ భిక్షమయ్య,రాష్ట్ర కార్యదర్శి వెంకటేశం, గణేష్, సయ్యద్బాబా, లక్ష్మయ్య, సైదులు, ఉదయకుమారి, గోపి, చిన్నయ్య, వెంకన్న, వీరయ్య పాల్గొన్నారు.