Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లేబర్ కోడ్, విద్యుత్ సంస్కరణలు కూడా రద్దు చేయాలి
ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వాల మెడలు వంచుతాం
యాసంగి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతివ్వాలి
మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించడం రైతుల విజయమేనని సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.శుక్రవారం జిల్లాకేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.కార్మికులకు అన్యాయం జరిగే నాలుగు లేబర్కోడ్లు, విద్యుత్ సంస్కరణలను కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.లేకుంటే ప్రజాఉద్యమాల ద్వారా ప్రభుత్వాలమెడలు వంచు తామన్నారు. కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా ఎవరు చెప్పినా వినకుండా ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయకుండా కార్పొరేట్ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి రైతులు నష్టపోయే విధంగా పార్లమెంట్లో చట్టాలను అమలుచేశారని విమర్శించారు.చట్టాలను రద్దు చేయాలని కోరుతూ లక్షలాది మంది రైతులు ఢిల్లీకేంద్రంగా ధర్నాలు చేసి 700 మంది ఈ పోరాటంలో చనిపోయారని తెలిపారు.చనిపోయిన రైతులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులపై కేంద్ర ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులను విరమించుకోవాలని కోరారు.పెట్టిన రైతుచట్టాల వల్ల గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ పరాజయం కావడంతో త్వరలో ఐదు రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికలో బీజేపీకి నష్టం వాటిల్లుతుందని నల్లచట్టాలను రద్దు చేస్తున్నట్టు మోడీ ప్రకటించా డన్నారు.రైతులకు గిట్టుబాటుధర కావాలంటే ఎంఎస్పీ చట్టం తీసుకురావాలని కోరారు.23 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతుధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఐకేపీకేంద్రాలలో అధికారులు ధాన్యం కొనుగోలుచేయకపోవడంతో ముప్పై నలభై రోజుల నుండి ధాన్యం వర్షానికి తడిసి ఎండకు ఎండి మొలకలెత్తి పోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.రైతులు వ్యవసాయం చేయడమే పాపమా అని మండి పడ్డారు.మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే నష్టపరిహారం భరించి యుద ్ధప్రాతిపదికన వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుకేంద్రాల వద్ద రైతులు ఎంత అవస్థ పడుతున్నారో ముఖ్యమంత్రి కేంద్రాల వద్దకు వస్తే అర్థమవు తుందన్నారు. యాసంగిపంటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాసమస్యలపై పోరాటాలస్ఫూర్తితో ముందుకు సాగు తున్నామన్నారు.20వ జిల్లా మహాసభలో జిల్లా ప్రణాళిక రూపొందించుకొని ప్రాజెక్టుల సాధన కోసం ముందుకు సాగుతా మన్నారు.మహాసభలకు ఆర్థికంగా సహకరించిన ప్రతిఒక్కరికి, శ్రమించిన కార్యకర్తలకు కతజ్ఞతలు తెలిపారు.ధర్నాలో మరణించిన రైతులకు పార్టీ తరపున జోహార్లు అర్పిస్తున్నామన్నారు.రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మలవీరారెడ్డి మాట్లాడుతూ నల్లచట్టాలపై తగ్గేది లేదన్న మోడీని తగ్గడం వెనక ప్రజాపోరాటం ఉందన్నారు.సమస్యలపై ధర్నాలు, పోరాటాలు చేయకపోతే చరిత్రలో ఏమీ సాధించలేమని పేర్కొన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, సయ్యద్‌హాషం, చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఎండి.సలీం, దండెంపల్లి సత్తయ్య,పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, కొండఅనురాధ, మల్లం మహేష్ పాల్గొన్నారు.