Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్: ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని కాంగ్రెస్ నియోజ కవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు . రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వ విప్ గొంగిడి సునీ త ప్రకటించినప్పటికీ ఆచరణలో జరగడం లేదని పేర్కొన్నారు.రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో అన్ని వసతులు, సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. తక్షణం రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు తగిన కషి చేయాలని కోరారు.