Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మున్సిపల్ కేంద్రంలో 20ఏండ్ల కింద పోచమ్మ వీధి కురుమ సంఘం వరకు వెళ్లేందుకు వేసిన సీసీ గుంతలమయంగా మారింది. వాహనాల రాకపోకలు పెరగడంతో మరింత గుంతలుగా మారాయి. ఈ రోడ్డు గుండా ఎస్సీ కాలనీకి వాసులు , కుర్మసంఘం ,రామ్ శివాజీనగర్‌కు చెందిన వారు నిత్యం ఈ సీసీ రోడ్డు గుండా తిరుగుతుంటారు. ఇటీవల వర్షాలు కురవడంతో సీసీ రోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. ద్విచక్ర వాహనదా రులకు కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పాలకవర్గ సభ్యులు మున్సిపల్ అధికారులు తక్షణం స్పందించి వెంటనే సీసీ రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టి సమస్య పరిష్కరించాలని, వాహనదారులు కాలనీ వాసులు కోరుతున్నారు .
సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి
ఎగ్గిడి యాదగిరి ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు
గత 20ఏండ్ల క్రితం పోచమ్మ గుడి సమీపం లో కురుమ సంఘం,ఎస్సీ కాలనీ వెళ్లే దారిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరిగాయి, నిత్యం వందలాది మంది ఈ దారిగుండా వెళ్తుంటారు. ఈ దారి గుండా వాహనాల రద్దీ పెరగడంతో సీసీరోడ్డు గుంతలమయంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా బురదమయంగా మారడంతో పాదచారులు ,వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలి. మున్సిపల్ అధికారులు, స్థానిక వార్డు కౌన్సిలర్ వెంటనే స్పందించాలి .