Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
ప్రపంచవ్యాప్త మత్సకారుల దినోత్సవ వేడుకల సందర్భంగా మండల కేంద్రంలోని మత్స్య పారిశ్రామిక సొసైటీలో సొసైటీ అధ్యక్షులు కందుల హనుమంతు పర్యవేక్షణలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంగా గుర్తించడం గొప్ప విషయమన్నారు. నేటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయక పోవడం మూలంగా అభివద్ధి నోచుకోలేదన్నారు. కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి అభివద్ధికి దోహదపడాలని, ప్రత్యేక నిధులు ద్వారా సంఘం భవనాలు, చేపల మార్కెట్, ఉచిత చేప పిల్లల పంపిణీని వంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్న, మత్స్యకారుల పింఛన్లు, ఆరోగ్య వైద్య బీమా వంటి పథకాలు ప్రవేశ పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో లో సంఘం కార్యదర్శి ఉపాధ్యక్షులు పిట్టల మచ్చ గిరి, బాలరాజు, భైరబోయిన రమేష్, కందుల నరసింహ, కందుల మహేష్, బో ళ్ళ వెంకన్న, యట భాగ్యమ్మ, కందుల సత్తమ్మ, కందుల లలిత, ఇంద్రమ్మ, యాదమ్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.