Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్లుగీత కార్మిక సంఘం నల్గొండ జిల్లా
అధ్యక్షుడు కొండ వెంకన్న
నవతెలంగాణ -నల్లగొండ
రాష్ట్రంలో కల్లు గీత వత్తిపై ఆధారపడి జీవిస్తున్న 5 లక్షల కుటుంబాల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం కనగల్ మండలంలోని పర్వతగిరి గ్రామంలో నిర్వహించిన గీత కార్మికుల ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ లిక్కర్ పాలసీ వలన రోజు రోజుకి వత్తి దెబ్బతింటుందన్నారు. మద్యనిషేధం అమలు చేయాలని, ప్రతి సొసైటీకీ 5 ఎకరాల భూమి కేటాయించాలని, కల్లుకు మార్కెట్, నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గీతన్న బంధు పేరుతో రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.కల్లు ఆరోగ్యానికి మంచిదని ఔషద గుణాలున్నాయని జాతీయ పోషకాహార సంస్థ ప్రకటించినందున దీనికి మార్కెట్ సౌకర్యం కలగాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార కర్తగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కనగల్లుమండల ప్రధాన కార్యదర్శి సోము ముత్యాలు . ఒక్క రామచంద్రు. కాశయ్య సత్యనారాయణ వెంకన్న శంకర్ . యాదగిరి.తరుణ్. గీత కార్మికులు పాల్గొన్నారు.