Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఆలేరు మున్సిపల్ పట్టణ అభివద్ధికి కతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వవిప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత, టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మెన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి సహకారంతో పట్టణ అభివద్ధికి అహర్నిశలు కషి చేస్తుంటే కొందరు నాయకులు అవాక్కులు, చెవాక్కులు పేల్చుతున్నారని మున్సిపల్ చైర్మెన్ వసుపరి శంకరయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పని కట్టుకుని ప్రభుత్వ విప్ శాసన సభ్యురాలు సునీత పై బీజేపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు .అభివద్ధి జరుగుతున్న తీరును చూసి ఓర్వలేకే బీజేపీ నాయకులు ప్రజలకు మాయమాటలు చెబుతూ తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు . పట్టణ అభివద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు. బెదిరింపులకు భయపడబోమని పేర్కొన్నారు.రైతు సమస్యలపై అన్ని పక్షాలు ధర్నాలు ,రాస్తారోకోలు చేస్తుంటే బీజేపీ పట్టించుకున్న పాపాన పోలేదని పేర్కొన్నారు . రానున్న రోజుల్లో దశలవారీగా అభివద్ధి పనులు పూర్తిచేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.