Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్
రైతుల పట్ల సీఎం కేసీఆర్ ఉద్యమం చేయడంతోనే నల్ల చట్టాలను నరేంద్ర మోడీ రద్దు చేశాడని టీిఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జనగాం వెంకట పాపిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కొల్లూరు గ్రామంలో కేసీఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ శనివారం ఆలేరులో మాట్లాడిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగం ఉపేందర్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సరికాదన్నారు. రైతుల పట్ల సీఎం కేసీఆర్ ముందుండి అభివద్ధిలో నడిపిస్తున్నాడని కొనియాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది చూసుకోని నోరు జారకుండా మాట్లాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కోరుకోపూల కిష్టయ్య , మండల నాయకులు శ్రీధర్ ,పాల సొసైటీ చైర్మెన్ కోటగిరి వెంకటేష్ ,మల్లికార్జున్, మధు, పరమేష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.