Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీసీటీయూ రాష్ట్ర అధ్యక్షులు సురేష్
నవతెలంగాణ -నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనలో ఓబీసీ కుల గణన చేపట్టాలని బీసీటీయూ రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి సురేష్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆల్ఫా కళాశాలలో నిర్వహించిన ఆ సంఘం జిల్లా కార్యవర్గ ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ఉపాధ్యాయులకు ప్రమోషన్స్‌లో రిజర్వేషన్ కల్పించి క్రిమిలేయర్ విధానాన్ని పూర్తిగా తొలగించాలని పేర్కొన్నారు. అట్రాసిటీ విధానం బీసీలకు కూడా వర్తింపజేయాలన్నారు.అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఖచ్చితంగా స్కావెంజర్స్ ను నియమించి అవసరమున్న చోట విద్యా వాలంటీర్లను నియమించాలని కోరారు. కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జిల్లా అధ్యక్షులు కొన్నె శంకర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపులేటి నరేంద్ర స్వామి , జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యదర్శి నల్లమేకల వెంకయ్య , వరంగల్ రూరల్ అధ్యక్షులు పరమేష్ , రాష్ట్ర బాధ్యులు మారుపాక నర్సయ్య , సోమ లింగం , హెడ్ మాస్టర్ రాంబాబు ఇన్చార్జ్ హెడ్మాస్టర్ నూనెముంతల వెంకన్న ,పూస నరసింహ , కమ్మంపాటి శ్రీనివాసులు , నాగవెల్లి ఉపేందర్ , చింతకాయల పుల్లయ్య ,అంతటి అనిల్ ,మండల బాధ్యులు అనంతుల వెంకన్న , శ్రీధర్ గారు, కష్ణ , వెంకటరమణ , గడ్డం శ్రీనివాస్ , శ్రీను , నరేందర్, పాల్గొన్నారు.