Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుర్వి యాదయ్య
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
వాసాలమర్రి లో మాదిరిగానే రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు శాసనసభ్యులు ద్వారా కాకుండా నేరుగా గ్రామపంచాయతీ అకౌంట్లో నిధి జమ చేయాలని సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ కోరారు. ఆదివారంఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం తండాలను, చిన్న గూడెంలను అభివద్ధి చేసేందుకు పంచాయతీలుగా ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు హరితహారం పచ్చదనం పరిశుభ్రత చేయడం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి పల్లె మెరిసిపోతుందన్నారు. అదే తరహాలో నిధులు లేక చిన్న గ్రామపంచాయతీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు. ముఖ్యమంత్రి ప్రతి గ్రామ పంచాయతీకి రూ.25 లక్షల లు ప్రకటించి నేరుగా గ్రామ పంచాయతీలలో జమ చేయాలని కోరారు.