Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరిక శ్రీనివాసులు
నవతెలంగాణ -నల్లగొండ
ఈ నెల 26న ఇందిరాపార్క్ వద్ద వికలాంగుల హక్కుల పోరాట సమితి . ఆధ్వర్యంలో తలపెట్టిన మహాసభ విజయవంతం చేయాలని ఆ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరిక శ్రీనివాసులు కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చే రూ.3016 ల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలని, వికలాంగుల సంక్షేమ స్వతంత్ర శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.వికలాంగుల హక్కు చట్టం 2016 రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని, వికలాంగుల బంధుఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా నాయకురాలు బి స్వప్న,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము హరికుమార్, జిల్లా అధికార ప్రతినిధి చిలుముల జలంధర్, ఉపాధ్యక్షులువీరబోయిన సైదులు,దొంతగాని మహేష్, జిల్లా ఇంచార్జ్ తగుల వెంకన్న. కందుల కాళమ్మ. పరమేష్. వెంకన్న. తదితరులు పాల్గొన్నారు.