Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు సికిలమెట్ల శ్రీహరి
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీసీలకు అవకాశం ఇవ్వాలని సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు, నారాయణ పురం సర్పంచ్ సికిలమెట్ల శ్రీహరి కోరారు.ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన బీసీ యువజన సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలు ప్రభుత్వాల ఏర్పాటుకు ఓట్లు సహకరిస్తున్నారన్నారు. అట్లాంటి బీసీ నాయకుల ను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లా బీసీ నాయకుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి పోటీ చేసే అవకాశం బీసీలకు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నాయకులు శివ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.