Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
కేంద్ర ప్రభుత్వం తీసుకొ చ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన పోరాటంలో అమరు లైన రైతులను స్మరిస్తూ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అవైస్ చిస్తీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు బూరెల నరేష్ మాట్లాడుతూ చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యదర్శులు ముత్యాల మనోజ్ కుమార్, యాదవ్ శ్రీధర్, కాకునూరి మహేందర్, ఎండి.బురహాన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బిసికుంట్ల సత్యనారాయణ ఎండి.మజర్, ఎండి.రఫీ ఉద్దీన్ గౌరీ, మున్సిపల్ కౌన్సిలర్ సలావుద్దీన్ కైరం కొండ వెంకటేష్, ఎడమ ప్రవీణ్, ఎడమ పవన్, ఎండి .మోయిన్ పాల్గొన్నారు.