Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డంపింగ్ యార్డ్ ,వైకుంఠధామం ఏర్పాటు
ఆహ్లాదం పంచుతున్న పల్లె ప్రకృతి వనం
నవతెలంగాణ-బొమ్మలరామరం
మండలంలోని తిర్మలగిరి గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది. గ్రామంలో ఎక్కడ చూసిన పచ్చని ప్రకృతితో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తోంది. గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. సర్పంచ్ నూనావత్ అశోక్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధతో వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ , పల్లె ప్రకృతి వనం పనులు పూర్తిచేశారు. గ్రామంలో 900 జనాభా ఉంది. 600 ఓటర్లు ఉన్నారు. మిషన్ భగీరథ ట్యాంకు ద్వారా ప్రతి ఇంటికీి నల్ల కలెక్షన్లు ఇవ్వడంతో నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. గ్రామంలో పాతబడిన ఇండ్లను కూల్చివేత. రోడ్డు పక్కల పిచ్చిమొక్కలు చెత్త చెదారం డోజర్, జేసీబీ సహాయంతో తొలగించారు.డ్రైనేజీ లో బ్లీచింగ్ చల్లి శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలు పోవడానికి మందు స్ప్రే చేశారు. గ్రామంలో సీసీ రోడ్లను శుభ్రం పరచడం, పెండ్లిండ్లకు, ు అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేయడం కార్యక్రమాలు చేశారు. కరోనా వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేశారు.
ఆహ్లాదం పంచుతున్న పల్లె ప్రకృతి వనం
తిర్మలగిరి సర్పంచ్ నూనావత్ అశోక్ నాయక్
గ్రామస్తుల సహాయంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధి పనులైన డంపింగ్యార్డు, వైకుంఠధామం పూర్తి చేశాం. ఎకరం 20 గుం టల విస్తీర్ణంలో 6వేల మొక్కలు ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి వనం ఆహ్లాదం పంచుతోంది. మొక్కలు సంరక్షణకు చర్యలు తీసుకుంటు న్నాం. వివిధ రకలాల పండ్ల మొక్కలను నాటాం.
తీరిన వైకుంఠధామం సమస్య
ఉపసర్పంచ్ భానోత్ శేఖర్ నాయక్
గ్రామంలో వైకుంఠ ధామం సమస్య తీరింది. అన్ని సౌకర్యాలు, స్థానపు గదులు ఏర్పాటు చేశాం. ప్రభుత్వం చేపట్టిన పనులలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉంది. ప్రకతి వనంలో ఏర్పాటు చేయడం ఎంతో అదష్టం. పార్కులను చూడడానికి పట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు.