Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు, బ్యాంక్‌ల జాతీయకరణకు కషి చేసిన మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫొటో కరెన్సీ నోట్లపై ముద్రిం చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజా సైన్స్ వేదిక రాష్ట్ర నాయకులు జిట్టా భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం కు జ్ఞానమాలను (49వవారం) సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ స్వేచ్చా, స్వాతంత్య్రంగా జీవించడానికి అవసరమైన రాజ్యాంగంను రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫొటో కరెన్సీ నోట్లపై ముద్రించి ఆయనను గౌరవించడం అందరిబాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జిల్లా చైర్మెన్ కొడారి వెంకటేష్ ,జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, మునిసిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్ ,సాధన సమితి జిల్లా నాయకులు బండారు రవివర్దన్,పడిగల ప్రదీప్, బొడ్డు కష్ణ, మహ్మద్ సలావుద్దీన్,దర్గాయి దేవేందర్ అందె నరేష్, ఇటుకల దేవేందర్,దండు కష్ణ,మేడి కోటేష్ పాల్గొన్నారు.