Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిట్యాల:ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబసభ్యులను వైఎస్సార్పీసీ నాయకులు దుర్భాషలాడడం సిగ్గుచేటని, ఆపార్టీ నాయకుల ప్రవర్తన చూస్తే వారి కుటుంబంలోని ఆడపడుచులు తలదించు కుంటారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శేపూరి సుదర్శన్ ఆరోపించారు.సోమవారం పట్టణంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకుల తీరును ఆయన ఖండించారు.ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు వారి కుటుంబంపై అనుచిత, పరుషవ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, 13 ఏండ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేసి నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అభివద్ధి,సంక్షేమపథంలో నడిపించిన చంద్రబాబును, ఆయన కుటుంబసభ్యులను దుర్భాషలాడడం సరికాదన్నారు