Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ నియోజకవర్గ అభివద్ధి ప్రదాత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, బంజారా ముద్దుబిడ్డ, నిస్వార్థపరుడు, నిత్యం ప్రజల్లో ఉండే ప్రజా సేవకులు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ జన్మదిన వేడుకలను నేడు నియోజకవర్గవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు, నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కష్ణలు పిలుపునిచ్చారు.సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు విలేకర్లతో టీఆర్ఎస్ నాయకులు, యువజన, విద్యార్థి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో టీఆర్ఎస్వీ మండల, పట్టణ అధ్యక్షులు పాత్లవత్ లక్ష్మణ్, నున్సావత్ అభిషేక్, పగిడిమర్రి నాగరాజు, జమీర్, కరాటే వెంకట్, అనిల్ పాల్గొన్నారు.