Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ-మద్దిరాల
ప్రజలు, రైతుల పక్షాన పోరాటం చేసేది కేవలం ఎర్ర జెండానే అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు అన్నారు. సోమవారం మండలంలోని ముకుందాపురంలోని బద్దం సోమిరెడ్డినగర్లో నిర్వహించిన పార్టీ 2వ మహాసభలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. రైతు సంఘాలు, సీపీఐ(ఎం) కలిసి పోరాటం చేయడం వల్లే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసిందన్నారు. అనంతరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు కందాల శంకర్రెడ్డి, బుర్ర శ్రీనివాస్, మండల కార్యదర్శి కల్లేపల్లి భాస్కర్, పులుసు సత్యం, మద్దల కోటయ్య తదితరులు పాల్గొన్నారు.