Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
కాంగ్రెస్ గుండాల చేతిలో హత్యకు గురైన సీపీఐ(ఎం) నాయకులు బొంత శ్రీనివాస్‌రెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ మాజీ సర్పంచ్ రాపోలు సూర్యనారాయణ కోరారు. సోమవారం మండలంలోని నర్సింహులగూడెం గ్రామంలో నిర్వహించిన శ్రీనివాసరెడ్డి 14వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌రెడ్డిని కాంగ్రెస్ గూండాలు అతి కిరాతకంగా హత్య చేశారన్నారు. శ్రీనివాస్‌రెడ్డిని హత్య చేసి గ్రామంలో పార్టీ లేకుండా చేయాలని కుట్ర పన్నారని అన్నారు. అంతకు ముందు శ్రీనివాస్‌రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాసరెడ్డి స్థూపం వద్ద ఉయ్యాల కొండయ్య పార్టీ జెండాను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి దేవరం వెంకట్‌రెడ్డి, కవిత, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ జూలకంటి కొండారెడ్డి, విజయలక్ష్మీ, నాయకులు పిడమర్తి అబ్రహం లింకన్, మారం వెంకట్‌రెడ్డి, నందిపాటి శ్రీరాములు, పావని, ఉదయమ్మ, లక్ష్మమ్మ, స్వరూప, రవీందర్‌రెడ్డి, సైదిరెడ్డి, రమేష్, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : మాజీ సింగిల్‌విండో చైర్మన్ బొంత శ్రీనివాస్‌రెడ్డి ఆశయ సాధన కోసం ఉద్యమించాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి మిట్టగణపుల ముత్యాలు కోరారు. సోమవారం స్థానిక సుందరయ్య భవన్లో శ్రీనివాస్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ గుండాలు దారికాచి అతి దారుణంగా హత్య చేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే శ్రీనివాసరెడ్డికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీనివాస్, మన్యం లింగయ్య, జి.సత్యం, గడ్డమీది శ్రీను, వెంకన్న, ధనమూర్తి, టి.వెంకన్న, వలరాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.