Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎకరానికి రూ.40 వేల
స్వల్పకాలిక రుణాలు
డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో డీసీసీబీ బ్యాంకు అభివద్ధి పథంలో నడుస్తుందని డీసీసీబీ చైర్మెన్, టెస్కాబ్ వైస్‌చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు.నాబార్డు సహకారంతో నిర్మించిన మీటింగ్హాలును జిల్లాకేంద్రంలోని డీసీసీబీ బ్యాం క్లో సోమవారం ఆయన ప్రారంభించి మాట్లా డారు.నాబార్డు ఆర్థికసాయంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.నాబార్డ్ నిధులతో కమిటీహాల్ను కార్పొరేట్ స్థాయిలో నిర్మించా మన్నారు.రైతులకు స్వల్పకాలిక వ్యవసాయరుణాలను ఎకరానికి రూ.40 వేల చొప్పున ఇచ్చామన్నారు. ఉమ్మడినల్లగొండ జిల్లాకు రూ.50 కోట్లు మంజూరయ్యాయని,ఒక్కో సొసైటీకి రూ.20 లక్షల చొప్పున అందజేశామన్నారు.గతంలో సొసైటీలు నిర్ణయం దిక్కుతోచని పరిస్థితిలో ఉండేదని ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రి జగదీష్‌రెడ్డి సహకారాలతో సొసైటీలు అభివద్ధి చెందుతున్నాయని తెలిపారు.అభివృద్ధిలో సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌చైర్మెన్ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి, డైరెక్టర్లు పాశం సంపత్‌రెడ్డి, సైదయ్య, అంజిరెడ్డి, శ్రీనివాస్, సైదులు, జైరామ్నాయక్, సుష్మ,గిరిధర్, సీఈఓ మధన్ మోహన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.