Authorization
Mon Jan 19, 2015 06:51 pm
35 క్వింటాళ్ల టీ పొడి సీజ్
నవతెలంగాణ-సూర్యాపేట
నకిలీ టీ పొడి అమ్ముతున్న పలువురు వ్యాపారులను సూర్యాపేట పోలీసులు సోమవారం పట్టుకున్నారు. వారి నుంచి 35 క్వింటాల్ల టీపొడిని స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం..జిల్లా కేంద్రంలోని పలు షాపుల్లో నకిలీ టీ అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు పలు హోటళ్లు, టీ స్టాల్స్, కిరాణ షాపులపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 35 క్వింటాళ్ల నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ టీ పొడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, రాజమండ్రితో పాటు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నట్టు తెలిసింది. ఇక్కడ పట్టుబడిన వారి ద్వారా సేకరించిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు చోట్ల దాడులు నిర్వహించి పలువుర్ని పట్టుకున్నట్టు తెలిసింది.