Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్‌రెడ్డి నాగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, తహసీల్దార్ సైదులు గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక మూడు నెలల చట్టాలను తీసుకొచ్చిందని, అందుకు నిరసనగా అన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో ఎనిమిది నెలలు దేశవ్యాప్తంగా ధర్నా నిర్వహించి రైతు చట్టాలను రద్దు చేసే విధంగా ఉద్యమాలు చేయడంతో నల్లచట్టాలు రద్దయ్యాయన్నారు. వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని, వర్షాలకు తడిసిన పంట నష్టానికి నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా కోశాధికారి కత్తి శ్రీనివాస్‌రెడ్డి, ప్రజానాట్యమండలి జిల్లా సహాయ కార్యదర్శి దుబ్బ రామచంద్రయ్య, కేవీపీఎస్ జిల్లా నాయకులు దోరేపల్లి మల్లయ్య దుబ్బ ఏడుకొండలు రైతులు కర్నాటి సుధాకర్ రెడ్డి సైదిరెడ్డి ఎల్ యాదగిరి ఆర్ వెంకటయ్య పి నాగయ్య ఫీల్ ఆలయ శ్రీనివాసచారి శ్రీను శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.